సలాల్ డ్యాం ఐదు గేట్లు ఓపెన్
వెబ్ న్యూస్, బతుకమ్మ : భారత్ – పాక్ ల మధ్య ఉద్రిక్తత కొనసాగుతోంది. భారత్ సైనిక చర్యలే కాకుండా వాటర్ వార్, దౌత్య దాడికి దిగుతోంది. పాక్ పై మళ్లీ భారత్ వాటర్ అటాక్ చేసింది. శనివారం ఉదయం జమ్మూ కశ్మీర్ లో రియాసి జిల్లాలోని చీనాబ్ నదిపై నిర్మించిన సలాల్ ఆనకట్టపై 5 గేట్లను తెరిచారు. దీంతో పాకిస్థాన్ వైపు నీటి ప్రవాహం ఆకస్మాత్తుగా పెరిగింది. దీంతో పాక్ లోని నది ప్రవాహ ప్రాంతాల్లో భయాందోళన నెలకొంది. పాక్ కు దెబ్బ మీద దెబ్బ తగులుతుండటంతో ఉక్కిరిబిక్కిరి అయిపోతుంది.