Batukammanews
Newspaper Banner
Date of Publish : 07 January 2025, 9:50 pm Posted by : ramakrishna

వంట పాత్రలను శుభ్రంగా కడగాలి

  • ఎంపీడీవో చింత రాజ శ్రీనివాస్

బతుకమ్మ,కమ్మర్ పల్లీ: మధ్యాహ్న భోజనం తయారు చేసే ముందు తప్పనిసరిగా వంట పాత్రలను శుభ్రంగా కడగాలని ఎంపీడీవో చింత రాజ శ్రీనివాస్ అన్నారు. మంగళవారం మండలంలోని అమీర్ నగర్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించడం పూర్తయిన తర్వాత వంట పాత్రలను శుభ్రంగా కడిగి ఉంచాలని, వంట చేసే ముందు మరోసారి వాటిని శుభ్రంగా కడగాలని ఏజెన్సీ నిర్వాహకులకు సూచించారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థుల కోసం సిద్ధం చేసిన ఆహార పదార్థాలను ఆయన తనిఖీ చేశారు.శుభ్రమైన వాతావరణంలో కలుషితం కాకుండా మధ్యాహ్న భోజనాన్ని సిద్ధం చేయాలని నిర్వహకులకు సూచించారు. పాఠశాలలో విద్యార్థులకు ప్రతిరోజు ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం శుభ్రతతో కూడిన నాణ్యమైన భోజనాన్ని అందించాలన్నారు. విద్యార్థులతో కలిసి ఎంపీడీవో మధ్యాహ్న భోజనాన్ని చేశారు. అనంతరం పాఠశాల రికార్డులను పరిశీలించి ఉపాధ్యాయులకు పలు సలహాలు, సూచనలు చేశారు. తరగతి గదులను సందర్శించి ఉపాధ్యాయుల బోధన తీరును పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి ఇప్పటివరకు పూర్తయిన సిలబస్ గురించి అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.