- ఇరాన్ పై ఇజ్రాయిల్ తో అమెరికా చేస్తున్న పరోక్ష యుద్ధాన్ని ఆపివేయాలి
- సిరికొండలో అమెరికా దిష్టిబొమ్మ దగ్ధం
- సిపిఐ(ఎం.ఎల్) మాస్ లైన్ డివిజన్ సహాయ కార్యదర్శి ఆర్.రమేష్
సిరికొండ, బతుకమ్మ : యుద్దాల వల్ల అనేక రకాల నష్టం వాటిల్లుతుందని, యుద్దాలు జరిగిన దేశాల అభివృద్ధి వంద సంవత్సరాలు వెనక్కి వెళ్తాయని సిపిఐ(ఎం.ఎల్ ) మాస్ లైన్ డివిజన్ సహాయ కార్యదర్శి ఆర్. రమేష్ అన్నారు. మంగళవారం ఇరాన్ పై ఇజ్రాయిల్ తో పరోక్షంగా యుద్ధం చేయిస్తున్న అమెరికా పద్ధతిని ఖండిస్తూ సిరికొండలో యుద్ధంను నిలిపి వేయాలని సిపిఐ(ఎం.ఎల్ ) మాస్ లైన్ పార్టీ ఆధ్వర్యంలో అమెరికా దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతు అమెరికా పేద, చిన్న దేశాలపై తమ అజామాయిషీ నడవాలని, చమురు దోపిడి కోసం యుద్ధాలను తీసుకొస్తుందన్నారు. యుద్దాలవల్ల ప్రజలకు అపారమైన నష్టమని, వందేళ్లు వెనక్కి పోతామని ఆయన అందోళన వ్యక్తం చేశారు. ఇజ్రాయిల్ దేశాన్ని తన గుప్పిట్లో పెట్టుకుని అమెరికా ఇతర దేశాలపై రెచ్చగొట్టి యుద్ధాన్ని ప్రోత్సహిస్తుందన్నారు. అమెరికా ఇజ్రాయిల్ కుట్రల వల్ల పాలాస్థిన మొత్తం విధ్వంసమై చిన్నాభిన్నమైంది అన్నారు. అమెరికా చేతిలో కీలుబొమ్మగా మారిన ఇజ్రాయిల్ తన యుద్ధస్వభావంతో ప్రపంచంలోనే అనేక దేశాలపై కయ్యంకు కాలు దువ్వుతుందన్నారు.తన వ్యాపార సామ్రాజ్యన్ని విస్తీరంచుకోవడం కోసం, గల్ఫ్ దేశల్లో ఉన్న చమురు నిక్షేపాలను కోళ్లగొట్టడానికి యుద్ధపరిస్థితులను తెస్తున్నరన్నారు. దేశ దేశాల మధ్య విభేదాలను రెచ్చగొట్టి యుద్దాలను ప్రేరేపిస్తున్నారని, ఇప్పటికైనా యుద్ధం అపి ప్రపంచశాంతిని నెలకొల్పాలన్నారు. ఇప్పటికే పాలస్తీనా లాంటి దేశంను అన్నిరకాల విధ్వంసం చేశారని యుద్ధం సరికాదని ప్రపంచశాంతిని అన్ని దేశాల ప్రజలు, ప్రజాప్రతినిధులు కోరుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం. ఎల్) మాస్ లైన్(ప్రజాపంథా) ఆర్మూర్ డివిజన్ నాయకులు ఆర్. దామోదర్, మండల నాయకులు ఎస్. కిశోర్, మండల నాయకులు వి. భూమన్న, ఎల్. నరేష్, ఇ. గోపీ, జి. గంగమల్లు, జి బాల్ రెడ్డి, ఇ. ఎర్రన్న, తదితరులు పాల్గొన్నారు.