యుద్ధాలు ప్రపంచశాంతికి విఘాతం కలిగిస్తాయి

సిపిఎం నగర కార్యదర్శి సుజాత   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : యుద్ధాలు ప్రపంచశాంతికి విఘాతం కలిగిస్తాయని సిపిఎం నగర కార్యదర్శి సుజాత  అన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్ట్)  సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం నగరంలోని గాంధీ చౌక్ నుండి భగత్ సింగ్ చౌరస్తా వరకు పహల్గం ఉగ్రదాడిలో మరణించిన ప్రజలకు , వీర జవాన్లకు  నివాళి అర్పిస్తూ క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం నగర కార్యదర్శి సుజాత మాట్లాడుతూ ప్రజల భాగస్వామ్యంతో మాత్రమే దేశంలో ఉగ్రవాదాన్ని నిర్మూలించగలం...