Batukammanews
Newspaper Banner
Date of Publish : 22 June 2025, 7:45 pm Posted by : ramakrishna

యుద్ధాలు ప్రపంచశాంతికి విఘాతం కలిగిస్తాయి

  • సిపిఎం నగర కార్యదర్శి సుజాత

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : యుద్ధాలు ప్రపంచశాంతికి విఘాతం కలిగిస్తాయని సిపిఎం నగర కార్యదర్శి సుజాత  అన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్ట్)  సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం నగరంలోని గాంధీ చౌక్ నుండి భగత్ సింగ్ చౌరస్తా వరకు పహల్గం ఉగ్రదాడిలో మరణించిన ప్రజలకు , వీర జవాన్లకు  నివాళి అర్పిస్తూ క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం నగర కార్యదర్శి సుజాత మాట్లాడుతూ ప్రజల భాగస్వామ్యంతో మాత్రమే దేశంలో ఉగ్రవాదాన్ని నిర్మూలించగలం అని,  యుద్ధాలు ప్రపంచ దేశాల మధ్య ఉన్న శాంతికి వికాసం కలిగిస్తాయని అన్నారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం  ఇంటిలిజెన్సీ  విభాగం వైఫల్యం కారణంతో పహల్గాం ఉగ్రదాడి జరిగిందని దాదాపుగా 26 ప్రాణాలు కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. పాకిస్తాన్తో యుద్ధం చేయడానికి సిద్ధపడిన ప్రభుత్వం ఒక్క ఉగ్రవాదిని కూడా పట్టుకోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది అమెరికా అధ్యక్షుడు ట్రంప్ జోక్యంతోనే యుద్ధం ఆగిపోయిందని ప్రచారం జరుగుతుంది వాస్తవాలు దేశ ప్రజలకు తెలియాలంటే ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు పెట్టి ప్రధానమంత్రి మోడీ చెప్పాలని డిమాండ్ చేశారు. పహల్గాం ఉగ్రదాడి జరిగి ఇన్ని రోజులు గడిచిన కనీసం ఒక్కసారైనా మరణించిన కుటుంబాలను మోడీ పరామర్శించకపోవడం బాధాకరమని అన్నారు. అదేవిధంగా ట్రంప్ కనీసం 15 సార్లు పాకిస్తాన్ భారతదేశం నేనే ఆపానని పదేపదే చెబుతున్న ఇప్పటివరకు మోడీ స్పందించకపోవడంలోనీ అంతర్యమేమిటిని ప్రజలకు తెలపాలని అన్నారు. పార్లమెంట్ సమావేశాలను ఏర్పాటు చేయాలని ప్రతిపక్షాలు అడిగితే మోడీ  ఎందుకు భయపడుతున్నారని అన్నారు. ఉగ్రవాదులు దాడి చేసిన కాశ్మీర్ కు వెళ్లకుండా బీహార్ బిజెపి ఎన్నికలపై ప్రచార సభలో మోడీ పాల్గొనడం చూస్తే ఉగ్రవాదుల దాడిని చూపించి సెంటిమెంట్తో ఓట్లు సంపాదించాలని చూస్తున్నట్లు కనపడుతుంది అధికారం మీద  ఉన్న శ్రద్ధ దేశ ప్రజల పైన లేకపోవడం దురదృష్టకరమని అన్నారు. వెంటనే పహల్గం ఉగ్రదాడిలో అసువులు బాసిన వీర జవాన్ల, చనిపోయిన దేశ పౌరుల కుటుంబాలను మోడీ కలిసి పరామర్శించాలని కోరారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడం కోసం దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు ప్రజలను కలుపుకొని ఎదురుకోవాలని కానీ ఈ పని చేయకుండా ఎంపీలను ప్రపంచ దేశాలకు పంపించి టూర్లు తిప్పడం వలన ఉగ్రవాదాన్ని రూపుమాపలేమని చెప్పారు. ఈ కార్యక్రమంలో నగర కార్యవర్గ సభ్యురాలు అనిత, నగర కమిటీ సభ్యురాలు దీపిక , రేఖ, సత్యషీలా, అస్మిత, జ్యోతి, కళా, సునీత, రాజు, దినేష్ తదితర నాయకులు పాల్గొన్నారు.