Batukammanews
Newspaper Banner
Date of Publish : 17 January 2026, 8:08 pm Posted by : ramakrishna

బోధన్ మున్సిపాలిటీలో వార్డుల రిజర్వేషన్లు ఖరారు

. . . ఎస్సీ, ఎస్టీ, బీసీ, అన్‌రిజర్వ్ డ్ కేటగిరీలకు కేటాయింపులు – కలెక్టర్ ఇలా త్రిపాఠి

 

బోధన్, బతుకమ్మ :

 

బోధన్ మున్సిపాలిటీలో రానున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో వార్డుల రిజర్వేషన్ల తుది జాబితాను విడుదల చేశారు. ఈ మేరకు వివిధ కేటగిరీలకు వార్డుల కేటాయింపులు చేసినట్లు తెలిపారు. వివరాల ప్రకారం ఎస్టీ జనరల్ కేటగిరీకి ఒక వార్డు ఖరారు చేయగా, ఎస్సీ జనరల్ కేటగిరీకి రెండు వార్డులు, ఎస్సీ మహిళా కేటగిరీకి ఒక వార్డును కేటాయించారు. అలాగే బీసీ జనరల్ కేటగిరీకి ఎనిమిది వార్డులు, బీసీ మహిళా కేటగిరీకి ఏడు వార్డులు రిజర్వ్ చేశారు. అన్‌రిజర్వ్ డ్ కేటగిరీకి ఎనిమిది వార్డులు, అన్‌రిజర్వ్ డ్ మహిళా కేటగిరీకి పదకొండు వార్డులను కేటాయించినట్లు కలెక్టర్ వెల్లడించారు. ఈ రిజర్వేషన్ల ప్రకారం మున్సిపల్ ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. వార్డుల విభజన, రిజర్వేషన్ల వివరాలు ప్రజల సందర్శనార్థం మున్సిపల్ కార్యాలయం, సంబంధిత కార్యాలయాల్లో అందుబాటులో ఉంచినట్లు అధికారులు తెలిపారు.