వార్ సైరన్.. యుద్ధం మొదలైనట్టేనా..?
జమ్మూ టార్గెట్గా పాకిస్తాన్ డ్రోన్ దాడులు.. తిప్పికొట్టిన భారత్ ఢిల్లీ, బతుకమ్మ : భారత్ – పాకిస్థాన్ మధ్య యుద్ధం మొదలైనట్టేనా అంటే.. ప్రస్తుత పరిస్థితులను చూస్తే ఔననే అనిపిస్తుంది. ‘ఆపరేషన్ సిందూర్’ నేపథ్యంలో జమ్మూలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. భారత్ మెరుపు దాడులతో బిక్కచచ్చిన పాకిస్థాన్.. తన ఉనికిని చాటుకునేందుకు ప్రయత్నిస్తోంది. జమ్మూ లక్ష్యంగా దాడులకు తెగబడుతోంది. అయితే సర్వసన్నద్ధంగా ఉన్న భారత సైన్యం పాక్ దాడుల్ని తిప్పి కొడుతోంది. సత్వారీ, సాంబా, ఆర్ఎస్ పురా, ఆర్నియా సెక్టార్లలో పాక్ క్షిపణి...