Batukammanews
Newspaper Banner
Date of Publish : 30 January 2026, 8:41 pm Posted by : ramakrishna

వాల్ పోస్టర్ ఆవిష్కరణ

 

మోర్తాడ్, బతుకమ్మ :

 

ఆదర్శ విప్లవ కమ్యూనిస్టు నాయకుడు కామ్రేడ్ కర్నాటి యాదగిరన్న ప్రధమ వర్ధంతి సభను జయప్రదం చేయాలని సీపీఐ ఎమ్ ఎల్ మాస్ లైన్ (ప్రజాపంథా) మోర్తాడ్, ఏర్గట్ల సంయుక్త మండలాల కార్యదర్శి జి. కిషన్ అన్నారు. ఈ విషయానికి సంబందించిన వాల్ పోస్టర్ ను శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా టీయూసీఐ నిజామాబాద్ రూరల్, కామారెడ్డి సంయుక్త జిల్లా ఉపాధక్షురాలు వి.సత్యమ్మ మాట్లాడుతూ ఫిబ్రవరి 1వ తేదీన నిజామాబాద్ లోని గాయత్రి నగర్ లో గల వెంకటేశ్వర కళ్యాణ మండపం లో సీపీఐ ఎమ్ ఎల్ మాస్ లైన్( ప్రజాపంథా) పార్టీ ఆధ్వర్యంలో 11 గం.లకు జరగబోయే సభను జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో దశరథ్, గజానంద్, రామ్ రెడ్డి, డాక్టర్ శ్రీనివాస్, దయాల్ సింగ్, తదితరులు పాల్గొన్నారు.