స్వచ్ఛతతో మెలగండి ఆరోగ్యంగా ఉండండి

బతుకమ్మ,మోర్తాడ్: ఆగస్టు08: స్వచ్ఛదనం - పచ్చదనం కార్యక్రమంలో భాగంగా గురువారం సీజనల్ వ్యాధులు అయినటువంటి డెంగ్యూ, మలేరియా, విషజ్వరాలు రాకుండా తీసుకోవలసిన నివారణ చర్యలపై, జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ మోర్తాడ్ మండల కేంద్రంలో ఎంపీడీవో తిరుమల దేవి పర్యటించారు. వర్ష కాలం కావడంతో పరిసరాల పరిశుభ్రత లేకపోయినా, వ్యక్తి గత శుభ్రత పాటించక పోవడం, సీజనల్ వ్యాధుల గురించి అవగాహన లేకపోవడంతో డెంగ్యూ, వైరల్ జ్వరాలకు, మలేరియా, టైపాడ్ తదితర వ్యాధులు సోకడానికి అవకాశం ఉందని అందువలన ప్రజలు స్వచ్ఛతతో మెలగాలని ఆరోగ్యంగా...