Batukammanews
Newspaper Banner
Date of Publish : 08 August 2024, 2:21 pm Posted by : ramakrishna

స్వచ్ఛతతో మెలగండి ఆరోగ్యంగా ఉండండి

బతుకమ్మ,మోర్తాడ్: ఆగస్టు08: స్వచ్ఛదనం – పచ్చదనం కార్యక్రమంలో భాగంగా గురువారం సీజనల్ వ్యాధులు అయినటువంటి డెంగ్యూ, మలేరియా, విషజ్వరాలు రాకుండా తీసుకోవలసిన నివారణ చర్యలపై, జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ మోర్తాడ్ మండల కేంద్రంలో ఎంపీడీవో తిరుమల దేవి పర్యటించారు. వర్ష కాలం కావడంతో పరిసరాల పరిశుభ్రత లేకపోయినా, వ్యక్తి గత శుభ్రత పాటించక పోవడం, సీజనల్ వ్యాధుల గురించి అవగాహన లేకపోవడంతో డెంగ్యూ, వైరల్ జ్వరాలకు,

మలేరియా, టైపాడ్ తదితర వ్యాధులు సోకడానికి అవకాశం ఉందని అందువలన ప్రజలు స్వచ్ఛతతో మెలగాలని ఆరోగ్యంగా ఉండాలని తెలిపారు. ఇండ్ల చుట్టు నీరు నిలిచిన, మురుగు కాలువలు శుభ్రంగా లేక పోయినా, ఇంటిలోని మొక్కల కుండీల్లో నీరు నిలువ ఉన్న, ఇంటిలోని కూలర్ లో గానీ, పనికి రాని వస్తువులు ఇంటి దాబా పైన ఉంచిన వాటిలో వర్షం నీరు నిలిచినా వాటిలో దోమలు గుడ్లు పెడతాయి. వాటి సంతతి పెరిగి విష జ్వరాలు రావడనికి ప్రధాన కారణం అవుతాయని పేర్కొన్నారు. మండల కేంద్రంలో పర్యటించి ఇండ్లలో చుట్టూ పక్కల పనికి రాని వస్తువులల్లో నిలువ ఉన్న నీటిని పారబోయించారు. కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు, ఆశ వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.

Wake up clean and stay healthy