Batukammanews
Newspaper Banner
Date of Publish : 08 March 2025, 6:14 pm Posted by : ramakrishna

ఆపన్నహస్తం కోసం ఎదురుచూపు

  • బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతున్న పదేండ్ల బాలుడు నిఖిలేష్
  • చికిత్సకు రూ.60 లక్షలు ఖర్చు అవుతుందన్న డాక్టర్లు
  • ఏకైక పుత్రున్ని కాపాడుకోవాలని దాతలను సహాయం కోసం అర్థిస్తున్న తల్లిదండ్రులు

 

భీమ్ గల్, బతుకమ్మ : ముక్కుపచ్చలారని నిఖిలేష్ ను బ్లడ్ క్యాన్సర్ భూతం వెంటడుతోంది. 10 సంవత్సరాల నిఖిలేష్ వేల్పూర్ మండలం పచ్చల నడుకుడకు చెందిన ముస్కు నవీన్, దంపతులకు భగవంతుడు ఇచ్చిన ఏకైక కుమారుడు. అనారోగ్యంతో భాధపడుతున్న నిఖిలేష్ కు చికిత్స నిమిత్తం హైద్రాబాద్ యశోద హాస్పిటల్ కు తీసుకెళ్లగా అక్కడి డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించి బాలునికి మిక్స్డ్ ఫినోటైప్ ఆక్యూట్ లూకీమియా (పీఎంఏఎల్ )బ్లడ్ క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారించారు. నిఖిలేష్ కు వచ్చిన మహమ్మారి నుండి రక్షించేందుకు చేయాల్సిన వైద్యం చాలా ఖర్చుతో కూడుకున్న వైద్యమని, ఈ వైద్యానికి రూ. 60 లక్షల ఖర్చు అవుతుందని తెలపడం తో తమ ఏకైక పుత్రున్ని రక్షించుకొనేందుకు దాతల ఆర్ధిక సహాయం కోసం చేతులు చాచి ఆర్తిస్తున్నారు. దాతలు తమకు పుత్రభిక్ష పెట్టాలని, తమ కుమారుడు నిఖిలేష్ కు మారో జన్మను ప్రసాధించాలని కోరుతూ దాతల ఆపన్నహస్తం కోసం ఎదిరి చూస్తున్నారు. ఇప్పటికే ఆ భాధిత తల్లిదండ్రులు రూ. 12 లక్షల వరకు ఖర్చు చేశామని, తమ కుమారుణ్ణి రక్షించుకోవడానికి దాతల తోచిన సహాయం చేయాలను కోరుతున్నారు. మీరు మీ నిండు మనుసుతో చేస్తున్న సహాయం మా కుమారుని ప్రాణమని, మీ సహాయం ఎంతో విలువైందని, మీ సహాయం అందించి మా బాబును కాపాడాలని ప్రాణదాతలను ఆ భాదిత దంపతులు వేడుకుంటున్నారు. సహాయం చేయదలచిన దాతలు 9494719197 నంబర్ ఫోన్ పే చేయాలని వేడుకొంటున్నారు.

Wait for the hand of danger.