Batukammanews
Newspaper Banner
Date of Publish : 14 November 2024, 12:48 pm Posted by : ramakrishna

ఒకటో తేదీన వేతనాలు చెల్లించాలి

రుద్రూర్, బతుకమ్మ: ప్రతి నెలా ఒకటో తేదీన వేతనాలు చెల్లించాలని, బకాయిలను విడుదల చేయాలని రుద్రూర్ మోడల్ పాఠశాల సిబ్బంది కోరారు. పాఠశాల ఆవరణలో భోజన విరామ సమయంలో ప్లకార్డులను ప్రదర్శించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమకు ప్రతినెలా వేతనాలను 010 అకౌంట్ ద్వారా చెల్లించాలని డిమాండ్ చేశారు. నిరసనలో ప్రిన్సిపాల్ సతీశ్, చెన్నప్ప, బలరాం, ఫిరోజ్, చంద్రశేఖర్, రాఘవేంద్ర, రఘు, అనిల్, సంతోష్, సాయిక్రిష్ణ, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.