హమాలీ కార్మికుల కూలీ రేట్లు పెంచాలి

ఆర్మూర్, బతుకమ్మ : సివిల్ సప్లై హమాలీ కార్మికులు కూలిరేట్లు పెంచాలని ఏఐటియూసి జిల్లా నాయకులు ఆరెపల్లి సాయిలు డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న సివిల్ సప్లై హమాలీ కార్మకుల సమ్మెకు ఏఐటియూసీ ఆధ్వర్యంలో బుధవారం మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గతంలో క్వింటల్ 26 రూపాయలు ఉండగా 2024 సమ్మె పలితంగా మూడు రూపాయలు పెంచిన కార్పొరేషన్ ఇప్పటికీ పెంచిన రెట్లను అమలు చేయకపోవడం బాధాకరమని అన్నారు.  తక్షణమే పెంచిన రెట్లను అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు....