వేతనాలు తక్షణమే చెల్లించాలి

నిజామాబాద్, బతుకమ్మ: ‘కొత్త పంతుళ్లకు అందని మొదటి వేతనం’ శీర్షికన ‘బతుకమ్మ’లో ప్రచురితమైన కథనానికి పీఆర్టీయూ తెలంగాణ జిల్లా అధ్యక్షుడు కృపాల్ సింగ్ స్పందించారు. నూతనంగా నియమితులైన ఉపాధ్యాయులకు వెంటనే వేతనాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ జిల్లా విద్యాశాఖాధికారి అశోక్ కు గురువారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  ఉపాధ్యాయుల నియామక ఉత్తర్వులు, జాయినింగ్ రిపోర్టు, ఫిజికల్ ఫిట్ నెస్ సర్టిఫికెట్, విద్యాశాఖ జారీ చేసిన నూతన ఉపాధ్యాయుల జాబితతోపాటు యాక్ట్ 2 సర్టిఫికెట్ జిరాక్స్ లపై డీడీవో అటెస్టేషన్...