Batukammanews
Newspaper Banner
Date of Publish : 19 April 2025, 5:49 pm Posted by : ramakrishna

ప్రమాదవశాత్తు చెట్టును ఢీ కొని వీఆర్ఏ మృతి

రుద్రూర్, బతుకమ్మ : రుద్రూర్ మండల కేంద్రానికి చెందిన వీఆర్ఏ నాగయ్య పొతంగల్ మండలం హాంగర్గా ఫారం వద్ద ప్రమాదవశాత్తు చెట్టును ఢీ కొట్టి అక్కడికక్కడే మృతి చెందాడు. కొడుకు కళ్యాణ ఘడియలు దగ్గర పడుతుండగా పెళ్లి కొడుకు తండ్రిని అకాల మృత్యువు కబళించింది. తెల్లారితే కుమారుని వివాహం ఉండగా పెండ్లి పత్రికలు పంచేందుకు తన ద్విచక్ర వాహనంపై వెళ్లిన తండ్రిని మృత్యువు వెంటాడింది.  సంతోషంగా తన కొడుకు పెళ్లికి రమ్మని పిలిచేందుకు వెళ్లిన నాగయ్య అనంతలోకాలకు వెళ్లాడని బంధువులు గుండెలు పగిలేలా రోదిస్తున్నారు.