Batukammanews
Newspaper Banner
Date of Publish : 25 October 2024, 5:56 pm Posted by : ramakrishna

 ఓటు నమోదులో పాత పట్టభద్రుల ఓట్లను కొనసాగించాలి

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటు నమోదు కార్యక్రమంలో పాత పట్టభద్రుల ఓట్లను అలాగే కొనసాగించాలని ఎన్నికల కమిషన్ సీఈఓ సుదర్శన్ రెడ్డికి సామాజిక కార్యకర్త, సాఫ్ట్వేర్ ఉద్యోగి రవీందర్ ర్యాడవినతి పత్రం అందించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే కరీంనగర్, నిజామాబాద్, అదిలాబాద్, మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కు సంబంధించి ఓట్ల నమోదు కార్యక్రమం జరుగుతున్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 30 న ప్రారంభమైనఈ కార్యక్రమం నవంబర్ 6 వ తేదిన ముగియనున్న నేపథ్యంలో ఇంకా కేవలం నెలరోజుల వ్యవధి ఉండటం ,క్షేత్ర స్థాయిలో ప్రచారం కావడానికి సమయం లేకపోవడంతో తక్కువ రిజిస్టేషన్లు జరిగాయన్నారు. గత ఎన్నికల్లో ఓటు నమోదు చేసుకున్న గ్రాడ్యుయేట్లు ఈసారి కూడా కొత్తగా అందరిలాగా నమోదు చేసుకోవాలి అనే నియమం వల్ల చాలా మంది పాత గ్రాడ్యుయేట్లు ఈసారి తమ ఓటును నమోదు చేసుకోవడానికి విముఖత చూపుతున్నారన్నారు. దీంతో పాటు ఓటు నమోదు గడువును పొడిగించాలని కోరారు.