Batukammanews
Newspaper Banner
Date of Publish : 14 December 2025, 12:15 pm Posted by : ramakrishna

పంచాయతీ ఎన్నికల కోసం పోటెత్తిన ఓటర్లు

.. . 11 గంటల వరకు కామారెడ్డిలో 57.89 శాతం పోలింగ్ 

… నిజామాబాదులో 49.13 శాతం ఓట్ల నమోదు 

 

 నిజామాబాద్, బతుకమ్మ : 

 

రెండో విడత పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఓటర్లు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఓట్లు వేస్తున్నారు. ఆదివారం ఉదయం ఏడు గంటలకు మందకోడిగా ప్రారంభమైన పోలింగ్ శాతం 9 గంటలకు ఊపందుకుంది. ఉదయం 11 గంటల వరకు నిజామాబాద్ జిల్లాలో 158 పంచాయతీలకు జరుగుతున్న ఎన్నికల్లో 1,17,348 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు జిల్లాలో పోలింగ్ శాతం 49.13 గా నమోదయిందని అధికారులు తెలిపారు. కామారెడ్డి జిల్లాలో 11 గంటల వరకు 57.89% పోలింగ్ జరిగింది. ఎల్లారెడ్డి జుక్కల్ నియోజకవర్గాల్లోని 8 మండలాలకు జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో 11 గంటల వరకు 95115 మంది ఓట్లు వేశారు. ఉమ్మడి జిల్లాలో 80 శాతం కు పైగా పోలింగ్ జరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం ధర్మారం బి గ్రామంలో పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఒక పార్టీ అభ్యర్థి పోలింగ్ బూత్ లో ప్రచారం చేస్తున్నాడని ప్రత్యర్థి సర్పంచ్ అభ్యర్థి అభ్యంతరాన్ని వ్యక్తం చేశాడు ఈ విషయంలో ఇరువురు సర్పంచ్ అభ్యర్థుల కార్యకర్తల మధ్య గొడవకు దారితీసింది పోలీసులు వివాదాన్ని సద్దుమనిచారు.

Voters who turned out for the Panchayat elections