ఓటర్లు స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలి
కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి నిజామాబాద్, బతుకమ్మ : గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మూడు విడతల్లో జరగనున్న పోలింగ్ లో ప్రతి ఓటరు పాలుపంచుకుని స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని నిజామాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. జిల్లాలో 31 మండలాల పరిధిలో 545 గ్రామ పంచాయతీలు, 5022 వార్డు స్థానాలకు మూడు దశలలో ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేశామని వెల్లడించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం కాన్ఫరెన్స్ హాల్ లో గురువారం ఏర్పాటు...