Batukammanews
Newspaper Banner
Date of Publish : 29 June 2026, 7:14 pm Posted by : ramakrishna

ఓటర్లకు ఎన్యుమరేషన్ ఫారాలు నింపే విదంగా అవగాహన కల్పించాలి

 

. . . తహసీల్దార్ బాలయ్య వెల్లడి

 

ఇందల్వాయి, బతుకమ్మ :

 

ఇందల్వాయి మండలంలోని వివిధ గ్రామాలలో సోమవారం బిఎల్ఓ లకు ప్రభుత్వ ఆదేశాలను ఇందల్వాయి తహసిల్దార్ బాలయ్య వెల్లడించారు. ఈ మేరకు సోమవారం మండలంలోని నల్లవెల్లి, గౌరారం, కేకే తండా తదితర గ్రామాలను ఆయన సందర్శించారు. అనంతరం ఆయా గ్రామాలలో ప్రజలకు ఎన్యుమరేషన్ ఫారాలు నింపే విదంగా అవగాహన కల్పించాలని ఆదేశించారు. సంబంధిత బి ఎల్ వో లు ఓటర్లు ఫారాలు నింపే విధంగా అవగాహన కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ ఆదేశాలను ప్రజలకు వివరించాలని సూచించారు. ఏ గ్రామంలో కూడా ఒక్క ఓటు తప్పుగా నమోదు చేయవద్దని సూచించారు. ఆయన వెంట కేకే తండా సర్పంచ్, తో పాటు నల్లవెల్లి సర్పంచ్ కన్నె రాజేందర్, గౌరారం సర్పంచ్ హేమలత తదితరులున్నారు.