బ్యాలెట్ పేపర్లను మింగిన ఓటర్

జగిత్యాల, బతుకమ్మ : జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం వెంకటాపూర్ పోలింగ్ కేంద్రంలో గురువారం మద్యం మత్తులో  ఒక ఓటర్  బ్యాలెట్ పేపర్లను మింగారు.  బాక్స్ లో వేయవలసిన బ్యాలెట్ పేపర్లను వృద్ధుడు మింగడంతో కొద్దిసేపు పోలింగ్ కేంద్రంలో గందరగోళం నెలకొంది. దీంతో పోలింగ్ అధికారులు వృద్ధుడ్ని పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేశారు.