ఓటర్ నమోదు, మార్పులు, చేర్పులు, తొలగింపులు సజావుగా చేయాలి
కామారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ డి.శ్రీనివాస్ రెడ్డి మద్నూర్, బతుకమ్మ: ఎన్నికల సంఘం గుర్తింపు కల్గిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో బుధవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయం మద్నూర్ నందు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో కామారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ డి శ్రీనివాస్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం ఓటర్ ల నమోదు, మార్పులు, చేర్పులు తొలగింపులు సాజవుగా తప్పులు లేకుండా చేయాలని ఆదేశించారు. ఓటర్ లకు ప్రభుత్వ యంత్రం తో పాటు, రాజకీయ పార్టీల...