Batukammanews
Newspaper Banner
Date of Publish : 19 March 2025, 8:24 pm Posted by : ramakrishna

ఓటర్ నమోదు, మార్పులు, చేర్పులు, తొలగింపులు సజావుగా చేయాలి

  • కామారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ డి.శ్రీనివాస్ రెడ్డి

 

మద్నూర్, బతుకమ్మ:  ఎన్నికల సంఘం గుర్తింపు కల్గిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో బుధవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయం మద్నూర్ నందు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో కామారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ డి శ్రీనివాస్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం ఓటర్ ల నమోదు, మార్పులు, చేర్పులు తొలగింపులు సాజవుగా తప్పులు లేకుండా చేయాలని ఆదేశించారు. ఓటర్ లకు ప్రభుత్వ యంత్రం తో పాటు, రాజకీయ పార్టీల వారు కూడా ప్రజలకు ఓటర్ నమోదు, మార్పులు, చేర్పులు, తొలగింపుల పై గుర్తింపు కార్డు కు ఆధార్ నెంబర్, ఫోన్ నెంబర్ లింక్ చేసుకునే విధంగా అవగాహన కల్పించి చర్యలు తీసుకోవాలని కోరారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు ప్రతి పోలింగ్ కేంద్రానికి ఒక్కరి చొప్పున ప్రతి పార్టీ వారు బూత్ లెవల్ అసిస్టెంట్ లను నియమించుకోవాలని పార్టీల ప్రతినిధులకు సూచించారు. మరణించిన వారి ఓటర్ లను సంబంధిత కుటుంబ సభ్యులకు నోటీస్ ఇచ్చిన తర్వాత ఓటర్ జాబితా నుండి మరణించిన వారి పేర్లు తొలగించాలని తహసీల్దార్ లకు ఆదేశించారు. గతంలో చాలా మండలాలలో 80%  శాతంకు పైగా ఆధార్ లింక్ చేయడం జరిగిందనీ, మిగతా నమోదు కానీ వారిని లింక్ చేసుకునే విధంగా ప్రచారం చేసి స్థానిక పోలింగ్ అధికారుల ద్వారా నమోదు ప్రక్రియ చేయాలని తెలిపారు. ఈ సమావేశంలో నియోజక వర్గ తహసీల్దార్ లు ఎండి ముజీబ్ మద్నూర్, భిక్షపతి నిజాంసాగర్, దశరథ్ పెద్ద కోడప్గల్, సవాయిసింగ్ మొహమ్మద్ నగర్, మహేందర్ కుమార్ జుక్కల్, డోంగ్లి నాయబ్ తహసిల్దార్ శరత్ కుమార్, మద్నూర్ నాయబ్ తహసిల్దార్ శివ రామకృష్ణ, మండల గిర్దవర్ శంకర్, రాజకీయ పార్టీల ప్రతినిధులు బాలు షిండే కాంగ్రెస్ పార్టీ, కృష్ణ పటేల్ బీజేపీ పార్టీ, కే హన్మాండ్లు  బి ఆర్ ఎస్ పార్టీ, రోహిత్ దాస్ బీఎస్పీ పార్టీ పాల్గొన్నారు.