Batukammanews
Newspaper Banner
Date of Publish : 18 July 2025, 11:44 am Posted by : ramakrishna

బీహార్ ఎన్నికల్లో ’సర్‘ పేరుతో ఓటు చోరీ

బీజేపీకి ఎన్నికల చోర్ బ్రాండ్ గా ఎలక్షన్ కమిషన్

ఈసీపై రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు

వెబ్ న్యూస్, బతుకమ్మ :  బీహార్ ఎన్నికల్లో స్పెషల్ ఇంటెన్సవ్ రివిజన్ (సర్) పేరుతో దొంగ ఓట్లను వేయించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారని, ఓటర్ లిస్ట్ సవరణ పేరుతో నిజమైన ఓట్లను తొలగిస్తున్నారని లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఈమేరకు రాహుల్ ’ఎక్స్‘ వేదికగా సంచలన ఆరోపణలు చేశారు. ఎలక్షన్ కమిషన్ బీజేపీకి ఎన్నికల చోర్ బ్రాండ్ గా మారిందని, ఈసీ బహిరంగంగా బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తుందని వ్యాఖ్యనించారు.  బీహార్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఓట్ల రాజకీయ వేడి రాజుకుంది. అలాగే హర్యానాలోని హిస్సార్ లో దళిత యువకుడు గణేష్ వాల్మీకి హత్య, అతని కుటుంబం పై జరిగిన దాడి నేరం మాత్రమే కాదని అది బీజేపీ ఆర్ఎస్ఎస్ మనువాద వ్యవస్థకు తార్కాణమన్నారు. గణేష్ వాల్మీకిని పోలీసులే చంపేశారని, ఘటన జరిగి 10 రోజులు గడుస్తున్న ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. గత 11 ఏళ్ల బీజేపీ పాలనలో దళితులు, ఆదివాసీలు మైనారిటీలపై దాడులకు నియంత్రణ లేకుండా పోయిందని రాహుల్ గాంధీ  అన్నారు.