. . . ఆర్టీసీ డిపో ఏర్పాటుకు ప్రజల స్వచ్చంధ బంద్
. . . మద్దతు పలికిన అన్ని పార్టీలు
నందిపేట్ , బతుకమ్మ :
నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండల కేంద్రంలో బస్సు డిపో ఏర్పాటు కమిటీ సభ్యుల పిలుపు మేరకు ఈరోజు మండలం బంద్ కార్యక్రమం లో స్వచ్ఛందంగా బంద్ నిర్వహించారు. మంగళవారం ఉదయం నుంచి మండలంలోని షాప్ యాజమాన్యం, స్కూల్స్, కాలేజీలు కూడా బంద్ ప్రకటించారు. ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం ప్రజల కోరిక వారి రవాణా సౌకర్యార్థం డిపో ఏర్పాటు చేయాలని అన్నారు. దశాబ్ధాలుగా ప్రజల కోరిక ఐన ఆర్టీసీ డిపో ఏర్పాటు చేసి నందిపేట్ ప్రజల ఆకాంక్ష నెరవేర్చాలని కోరారు. ప్రజలు స్వచ్చందంగా డిపో ఏర్పాటు కోసం భూసేకరణ చేసి ఇచ్చారని గుర్తు చేశారు. లేకపోతే ముందు ముందు ఇంకా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతాం అని చెప్పారు. ఆర్టీసీ డిపో ఏర్పాటు కోసం జరిగిన మండల బంద్ కు అన్ని పార్టీలు మద్దతు తెలిపారు. పోలీసులు అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. శాంతియుత దోరణిలో బంద్ ప్రశాంతంగా జరిగింది.