Batukammanews
Newspaper Banner
Date of Publish : 28 October 2025, 7:57 pm Posted by : ramakrishna

యువతకు వాలీబాల్ పోటీలు

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ నగరం లో గల 5 వ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసుల అమరవీరుల సంస్కరణల దినోత్సవం సందర్భంగా  పోలీసు కమిషనర్ సాయి చైతన్య ఆదేశాల మేరకు నాగారం లోని రాజారాం స్టేడియం లో వాలీబాల్ పోటీలను నిర్వహించారు. 5వ టౌన్ పరిధిలోని వివిధ ప్రాంతాలకి సంబంధించి టీమ్ లతో “యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి క్రీడల్లో పాల్గొనాలి” అనే నేపధ్యం తో ఈ క్రీడలను నిర్వహించినట్లు ఐదో టౌన్ ఎస్ఐపి ఎం.గంగాధర్ తెలిపారు. ఈ పోటీల్లో  సీతారం  నగర్ కాలనీ, ఆనంద్ నగర్ కాలనీ, నాగారం,ఇంద్రాపూర్, 300 క్వాటర్స్,  50 క్వాటర్స్, 80 క్వాటర్స్,సాయి నగర్, ఐదో టౌన్ పీఎస్ 10 టీమ్ లు పాల్గొన్నాయని తెలిపారు.

Volleyball competitions for youth