నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : పదో తరగతి ఫలితాల్లో విశ్వభారతి విద్యాలయం విద్యార్థులు 100శాతం ఫలితాలు సాధించి తమ సత్తా చాటారని హెచ్ఎం అండ్ కరస్పాండెట్ ఈ.శ్యాం సుందర్ రెడ్డి తెలిపారు. సంగెం తేజశ్వి అనే విద్యార్థి 557/600 మార్కులు సాధించి పాఠశాల మొదటి టాపర్ గా, చౌకి ప్రవళిక 546/600 మార్కులు సాధించి పాఠశాల రెండో టాపర్ గా, బానోత్ రాజేష్ కుమార్ 542/600 మార్కులు సాధించి పాఠశాల మూడో ర్యాంకర్ గా

నిలిచారని తెలిపారు. 500లకు పైగా మార్కులు 43శాతం, 450-499 మధ్య 23శాతం విద్యార్థులు, 400-449 మధ్య 31శాతం విద్యార్థులు, 400కన్న తక్కువ మార్కులు 3శాతం విద్యార్థులు సాధించారని తెలిపారు. ఈ సందర్భంగా ఉత్తమ ఫలితాలు సాధించడానికి క్రుషి చేసిన ఉపాధ్యాయ బ్రుందానికి, విద్యార్థుల తల్లిదండ్రులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల అడ్మినిస్టేటర్ ఈ.సుధీర్ రెడ్డి, ఈ.రేఖారెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
