బాధిత కుటుంబాలను పరామర్శ

భీమ్ గల్, బతుకమ్మ :  మండలంలోని చెంగల్ గ్రామానికి చెందిన భాదిత కుటుంబాలను బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ ఆదివారం పరామర్శించారు. ఇందులో భాగంగా గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు వసంత్ రెడ్డి వాళ్ళ చిన్న నాన్న నూతుల చిన్నారెడ్డి ఇటీవల అనారోగ్యంతో మరణించగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపాన్ని తెలిపారు. అదే గ్రామానికి చెందిన సంగెం శారద ఇటీవల అనారోగ్యంతో మరణించగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు...