Batukammanews
Newspaper Banner
Date of Publish : 28 September 2024, 3:40 pm Posted by : ramakrishna

తెలంగాణ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న పోచారం

బతుకమ్మ,బీర్కుర్: మండలంలోని తిమ్మాపూర్ గ్రామ తెలంగాణ తిరుమల దేవస్థానం లోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి శనివారం దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహదారులు, బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి ఆలయ సమీపంలోని సమస్యల గురించి ఆరా తీశారు. సందర్శకులకు ఎలాంటి సమస్యలు రాకుండా చర్య తీసుకోవాలని ఆలయ కమిటీ సభ్యులకు తెలిపారు. బీర్కూర్ మండల నాయకులు, ప్రజాప్రతినిధులు,ఆలయ కమిటీ సభ్యులు,పోచారం వెంట ఉన్నారు.