కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్థిక సాయం అందజేత
మెండోరా, బతుకమ్మ:మెండోరా మండలం సోన్ పేట్ గ్రామానికి చెందిన సీనియర్ టిఆర్ఎస్ కార్యకర్త మంగలి నర్సయ్య అనారోగ్యకారణంగా మరణించడం జరిగినందున వారి కుటుంబ సభ్యులను పరామర్శించి రూ.10,000/- వేల ఆర్థిక సహాయాన్ని మెండోరా మండల BRS పార్టీ అధ్యక్షులు,DCCB డైరెక్టర్ ,PACS చైర్మన్- బుస్సాపూర్ నాగంపేట శేఖర్ రెడ్డి అందించారు. కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ ముఖ్యనాయకులు బురుకల కమలాకర్, గోలి ప్రకాష్, గోపిడి గంగారెడ్డి,సాగర్ గౌడ్ , మోహన్ రెడ్డి, కోమనపల్లి భూమన్న , నాగులపల్లి ముత్యం రెడ్డి తదితరులు పాల్గొన్నారు.