ఏర్గట్ల, బతుకమ్మ :
మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు పిఎంఎస్ హెచ్ఆర్ఐ కింద వచ్చిన నిధులతో ప్రభుత్వ ఆదేశానుసారం బుధవారం రోజున నాగార్జునకొండ మ్యూజియాన్ని సందర్శించారు. ఈ సందర్భంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కృష్ణ చారి మాట్లాడుతూ చరిత్ర పురావస్తు సంపదపై అవగాహన పెంపొందించాలనే ఉద్దేశంతో అధ్యయన పర్యటన నిర్వహించినట్లు తెలిపారు. నాగార్జునసాగర్ జలాశయంలోని నాగార్జునకొండ ద్వీపంపై ఏర్పాటు చేసిన మ్యూజియంలో బౌద్ధ శిల్పాలు,శాసనాలు, విహారాలు, స్తూప అవశేషాలను విద్యార్థులు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ నాగరాణి, పాఠశాల ఉపాధ్యాయులు మునురుద్దీన్, ప్రసాద్, రాజశేఖర్, సబ్బాన్ శ్రీనివాసులు, విజయకుమార్, రాజేందర్, రాజ నరసయ్య, గంగాధర్, ప్రవీణ్ శర్మ, ట్రింకిల్ కుమార్, నరేష్, గంగమోహన్ లు పాల్గొన్నారు.