యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షునిగా విపుల్ గౌడ్
నిజామాబాద్ సిటి, బతుకమ్మ నిజామాబాద్ జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షునిగా విపుల్ గౌడ్ ఎన్నికయ్యారు. గడిచిన మూడు నెలల క్రితం జరిగిన ఎన్నికల్లో విపుల్ గౌడ్, నాగేంద్రతో పాటు మరో ముగ్గురు అధ్యక్ష పదవికి పోటీ పడ్డారు. సంబంధిత ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు పూర్తి చేసి అధికారికంగా విపుల్ గౌడ్ గెలిచినట్లు ప్రకటించారు. ప్రధాన కార్యదర్శిగా మహ్మద్ ఇర్ఫాన్ గెలుపొందినట్లు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లాలోని అన్ని మండలాల యూత్ కార్యవర్గ విజేతలను ప్రకటించారు.