బతుకమ్మ, బోధన్ : బోధన్ పట్టణంలో వినాయక నిమజ్జనోత్సవం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని వివిధ మండళ్లకు చెందిన గణనాథ విగ్రహాలను అలంకరించిన వాహనాల్లో ఊరేగించారు. డీజే సౌండ్‌ల మధ్య యువకులు నృత్యాలు చేస్తూ శోభాయాత్రలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రత్యేక అలంకరణలతో అణకరించిన రథాలు పట్టణ వీధుల్లో ఆకర్షణీయంగా కనపడ్డాయి. అనంతరం స్థానిక జూనియర్ కళాశాల బావి, పసుపు వాగు చెరువుల్లో విగ్రహాలను నిమజ్జనం చేశారు. తెల్లవారుజాము వరకు కొనసాగిన ఈ నిమజ్జనం విశేషంగా మారింది.
