వినాయక చవితి ఉత్సవాలను శాంతియుత వాతావరణంలో నిర్వహించుకోవాలి
బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి బతుకమ్మ, బాన్సువాడ : వినాయక చవితి ఉత్సవాలను శాంతియుత వాతావరణంలో నిర్వహించుకోవాలని బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి సూచించారు.బాన్సువాడలో పీస్ కమిటీ సమావేశానికి సోమవారం ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు ఊరూరా, కాలనీ వారీగా ఏర్పాటయ్యే మండపాల్లో శాంతి భద్రతలను కాపాడుకోవడం మనందరి బాధ్యత అని, పోలీసులు సూచించే మార్గదర్శకాలు పాటించాలని తెలిపారు. పండుగలు ఎవరికి ఇబ్బందులు కలగకుండా ఉత్సవాలను జరుపుకోవాలని పేర్కొన్నారు. మండపాల ఏర్పాటు, మైక్‌ల వినియోగం, నిమజ్జన కార్యక్రమాల విషయంలో ప్రభుత్వ నిబంధనలను కచ్చితంగా...