సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన వినయ్ రెడ్డి
ఆర్మూర్, బతుకమ్మ : తెలంగాణ సీ. ఎం అనుముల రేవంత్ రెడ్డిని ఆర్మూర్ కానిస్టెన్సీ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి మంగళవారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఆర్మూర్ కానిస్టెన్సీ అభివృద్ధికి నిధులిచ్చి సహకరించాలని అభ్యర్థించారు. కానస్టెన్సీ అభివృద్ధికి గాను ఎస్ డీ ఎఫ్ నిధుల నుండి రూ. 20 కోట్లు కేటాయించాలని కోరారు. కానిస్టెన్సీలోని ఆర్ అండ్ బి, పంచాయతీ రాజ్ రోడ్ల నిర్మాణంనకు, ఆర్మూర్ పట్టణాభివృద్ధికి నిధులు కేటాయించాలని కోరారు. ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో కావాల్సిన డాక్టర్లను నియమించి,...