Batukammanews
Newspaper Banner
Date of Publish : 22 January 2025, 8:56 pm Posted by : ramakrishna

అధికారులను నిలదీసిన గ్రామస్తులు

కామారెడ్డి, బతుకమ్మ : కామారెడ్డి జిల్లా మహమ్మద్ నగరర్ మండలంలోని కోమలంచ గ్రామంలో బుధవారం నిర్వహించిన ప్రజా పాలన గ్రామసభలో అధికారులను గ్రామస్తులు నిలదీశారు. అనర్హులకు సంక్షేమ పథకాలు అందిస్తూ అర్హులకు మొండిచేయి చూపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్హులను పక్కన పెట్టి అనర్హులకు రేషన్ కార్డులు, రైతు భరోసా, రైతు బీమా వంటి పథకాలను అందిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.