గ్రామపంచాయతీ ఈఓ పై చర్యలు కోరిన గ్రామస్తులు

  భిక్కనూరు, బతుకమ్మ :   భిక్కనూరు గ్రామపంచాయతీ అధికారుల తీరుపై గ్రామస్తులు శనివారం కామారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. గ్రామస్తుల తరఫున ఇచ్చిన వినతిపత్రంలో పలు ఆరోపణలను ప్రస్తావించారు. గతంలో జిల్లా కలెక్టర్ ఇచ్చిన ఆదేశాలను భిక్కనూరు గ్రామపంచాయతీ ఈవో మహేష్ కుమార్ గౌడ్ పూర్తిగా అమలు చేయలేదని గ్రామస్తులు ఆరోపించారు. షెడ్డు పూర్తిగా తొలగించినట్లు పత్రిక ప్రకటన ఇచ్చినప్పటికీ, క్షేత్రస్థాయిలో మాత్రం తొలగింపు జరగలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. అలాగే, 2017లో ఎలాంటి అనుమతులు లేకుండా...