జుక్కల్ ఎమ్మెల్యే పై గ్రామస్తుల తిరుగుబాటు
జుక్కల్, బతుకమ్మ : కామారెడ్డి జిల్లాలో అధికార పార్టీ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావుకు ప్రజల నుంచి నిరసన ఎదురైంది. పంచాయతీ ఎన్నికలలో ప్రచారానికి వచ్చిన జుక్కల్ ఎమ్మెల్యే ను పెద్ద కొడప్ గల్ మండలం బేగంపూర్ గ్రామస్తులు నిలదీశారు. శుక్రవారం గ్రామంలో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి ప్రచారం కోసం వచ్చిన ఎమ్మెల్యేను తమ ఊరికి ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఒక్కటి నెరవేర్చలేదని ఎందుకు వచ్చారని ప్రశ్నించారు. గ్రామంలోకి రావద్దని వెళ్లిపోండి అని మండిపడ్డారు. దానితో ఎమ్మెల్యే అనుచరులు కాంగ్రెస్ కార్యకర్తలు గ్రామస్తులపై కి దూసుకు వచ్చారు....