Batukammanews
Newspaper Banner
Date of Publish : 28 October 2025, 8:09 pm Posted by : ramakrishna

ఇసుక టిప్పర్లును అడ్డుకున్న గ్రామస్తులు

బతుకమ్మ, కోటగిరి : ఇందిరమ్మ  ఇండ్ల పేరిట  అనుమతులు ఉన్నాయంటూ తరలిస్తున్న ఇసుక టిప్పర్లను పొతంగల్ గ్రామస్తులు అడ్డుకున్నారు.  రైతు పొలంలో ఇసుకమేటలు పేరుకపోయాయి అని అనుమతులు తీసుకొని ఇసుక లేని చోట అనుమతులు పొంది మంజీరా లో ఇసుక దోపిడికి పాల్పడుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. జిల్లా కలెక్టర్ ఇతర రెవెన్యూ అధికారులు తక్షణమే స్పందించి మంజీరా లో ఇసుక తవ్వకాలపై సమగ్ర విచారణ చేపట్టాలని సర్వే చేపట్టి ఇసుక ఉన్నచోట మాత్రమే అనుమతులు ఇవ్వాలని స్థానికులు రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఇసుక మేటలు లేనప్పటికీ  మంజీరా నది నుండి ఇసుకను తరలించి అనుమతుల పేరుతో పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. వెంటనే జిల్లా కలెక్టర్ స్పందించి అక్రమ రవాణాలకు అడ్డుకట్ట వేయాలని  కోరారు.