నీటి సమస్య తీర్చాలంటూ గ్రామస్తులు ఆందోళన….
నీళ్లు కావాలంటే- జారిపడాల్సిందే........ పేరుకే మిషన్ భగీరథ నల్లాలు... కార్యదర్శికి పలుమార్లు చెప్పిన పట్టించుకోవడం లేదంటూ గ్రామస్తులు ఆగ్రహం.... కోటగిరి , బతుకమ్మ: - నీళ్లు కావాలంటే జారి పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని తమ సమస్యను పలుమార్లు చెప్పిన పట్టించుకోవడం లేదంటూ రోడ్డుపై నిరసన తెలిపారు. శుక్రవారం నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం ఎక్లాస్ పూర్ క్యాంపు గ్రామంలోని ఎస్సీ కాలనీ వాసులు ఖాళీ బిందెలతో రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. కాలనీ వాసులు మాట్లాడుతూ.... గత మూడు నాలుగు రోజులుగా బోరు చెడిపోయి...