నీళ్లు కావాలంటే- జారిపడాల్సిందే……..
పేరుకే మిషన్ భగీరథ నల్లాలు…
కార్యదర్శికి పలుమార్లు చెప్పిన పట్టించుకోవడం లేదంటూ గ్రామస్తులు ఆగ్రహం….
కోటగిరి , బతుకమ్మ:
– నీళ్లు కావాలంటే జారి పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని తమ సమస్యను పలుమార్లు చెప్పిన పట్టించుకోవడం లేదంటూ రోడ్డుపై నిరసన తెలిపారు. శుక్రవారం నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం ఎక్లాస్ పూర్ క్యాంపు గ్రామంలోని ఎస్సీ కాలనీ వాసులు ఖాళీ బిందెలతో రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు.

కాలనీ వాసులు మాట్లాడుతూ…. గత మూడు నాలుగు రోజులుగా బోరు చెడిపోయి నీళ్లు రావడం లేదంటూ పంచాయతీ కార్యదర్శికి తెలిపిన పట్టించుకోవడం లేదంటూ అగ్రహ వ్యక్తం చేశారు. వ్యవసాయ భూమిలోని బోర్లను నీరు తీసుకువెళ్తే జారి పడాల్సిన పరిస్థితి నెలకొందని వాపోయారు. పేరుకే మిషన్ భగీరథ నల్లాలు ఏర్పాటు చేసిన ఇప్పటివరకు ఒక్క నీటి బొట్టు కూడా రాలేదని అడిగితే గ్రామంలో ఉన్న రెండు వాటర్ ట్యాంకులలో ఒకటి మాత్రమే నింపాలని ఆదేశాలు ఉన్నాయని చెబుతూ సంబంధిత అధికారులు తమ కాలనీ పై వివక్షత చూపుతున్నారని వాపోయారు. పలుమార్లు మిషన్ భగీరథ అధికారులకు తెలిపిన చూసి వెళ్తున్నారే తప్ప ఇప్పటివరకు సమస్యను మాత్రం పరిష్కరించడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే అధికారులు స్పందించి బోరును బాగు చేసి, దానితో పాటు మిషన్ భగీరథ నీళ్లు వచ్చేలా చేసేంతవరకు కదిలేది లేదంటూ రోడ్డుపై బైఠాయించారు.