Batukammanews
Newspaper Banner
Date of Publish : 29 April 2026, 5:38 pm Posted by : ramakrishna

బట్టాపూర్ లో సీసీ, డ్రైనేజీ పనులు ప్రారంభించిన గ్రామ సర్పంచ్

 

ఏర్గట్ల, బతుకమ్మ :

 

ఏర్గట్ల మండలంలోని బట్టాపూర్ గ్రామంలో సీసీ, డ్రైనేజీ పనులను స్థానిక సర్పంచ్ భూషణ వేణి ప్రవీణ్ యాదవ్, మంగళవారం కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్, ఉప సర్పంచ్ మాట్లాడుతూ గ్రామ అభివృద్దె తమ ధ్యేయంగా ముందుకు సాగుతామని తమ గ్రామాన్ని అన్ని రంగాల్లో ముందు ఉండే విధంగా చూస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ భూషణవేణి ప్రవీణ్ యాదవ్, ఉపసర్పంచ్ మూడ్ దయానంద్, వార్డు సభ్యులు సారంగి ముత్తేమ్మ, హేమలత, మౌనిక, నీలిమ, హుస్సేన్, మాలవత్ భీమానాయక్, పోకల్కర్ గణేష్, తాళ్ళ అరవింద్, గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు వేణుగౌడ్, సభ్యుడు గద్దల ముత్తెన్న, పంచాయతీ కార్యదర్శి ప్రశాంత్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.