రుద్రూర్ బతుకమ్మ :
వేసవికాలాన్ని దృష్టిలో ఉంచుకొని నీటి ఎద్దడి లేకుండా, కాలనీ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఉండడానికి రుద్రూర్ మండలంలోని పలు వార్డులలో గ్రామ సర్పంచ్ ఇందూరు సునీత చంద్రశేఖర్ ఆదివారం బోరు వేయించారు. బోరు వేయించడంతో ఈ సందర్భంగా కాలనీవాసులు హర్షం వ్యక్తం చేస్తు సర్పంచ్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.