కోదండ రామాలయంలో ప్రత్యేక పూజలు చేసిన గ్రామ సర్పంచ్

  బాన్సువాడ, బతుకమ్మ :   బీర్కూర్ మండల కేంద్రంలోని పురాతన కోదండ రామాలయం భక్తులతో కిటకిటలాడింది. ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో గ్రామ సర్పంచ్ ఆరిగే ధర్మతేజ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆలయ అర్చకులు వేద మంత్రోచ్ఛారణల మధ్య సీతారామ లక్ష్మణులకు ప్రత్యేక అభిషేకాలు, అలంకరణలు నిర్వహించారు. సర్పంచ్ రాక గ్రామ ప్రథమ పౌరుడు ఆరిగే ధర్మతేజ ఆలయానికి చేరుకోగా, ఆలయ కమిటీ సభ్యులు వారికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆశీర్వచనం స్వామివారిని దర్శించుకున్న అనంతరం సర్పంచ్ కి అర్చకులు తీర్థ...