గ్రామ పాలన అధికారుల ఎంపిక పరీక్ష ప్రశాంతం
నిజామాబాద్ / కామారెడ్డి, బతుకమ్మ : ఉమ్మడి జిల్లాలో ఆదివారం నిర్వహించిన గ్రామ పాలన అధికారుల ఎంపిక పరీక్ష ప్రశాంతంగా ముగిసిందని అధికారులు తెలిపారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆర్ట్ అండ్ సైన్స్ కశాశాలలో నిర్వహించిన పరీక్షకు 401 అభ్యర్థులకు గాను 377మంది హాజరయ్యారు. 24మంది గైర్హాజరయ్యారు. పరీక్ష కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తనిఖీ చేశారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ ప్రభుత్వ కళాశాలలో నిర్వహించిన పరీక్షకు 332మందికి గాను 302 మంది అభ్యర్థులు హాజరయ్యారు. 30మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారని...