Batukammanews
Newspaper Banner
Date of Publish : 05 September 2024, 3:18 pm Posted by : ramakrishna

బోధన్ సబ్ కలెక్టర్ గా వికాస్ మహతో

బతుకమ్మ, బోధన్ : నిజామాబాద్ జిల్లా బోధన్ సబ్ కలెక్టర్ గా వికాస్ మహతో గురువారం బాధ్యతలు చేపట్టారు. జార్ఖండ్ రాష్ట్రానికి  చెందిన వికాస్ మహతో 2022 బ్యాచ్ ఐఏఎస్ అధికారి.  ఇటీవల బదిలీ అయిన ఆర్డీవో అంబాదాస్ రాజేశ్వర్ నుంచి ఆయన సబ్ కలెక్టర్ గా బాధ్యతలు తీసుకున్నారు. బోధన్ కు వచ్చిన సబ్ కలెక్టర్ వికాస్ మహాతో ను బోధన్ తహసీల్దార్ విఠల్ తో పాటు ఆయా మండలాల అధికారులు మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.