హైదరాబాద్, బతుకమ్మ:
తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా గద్వాల విజయలక్ష్మీ నియమితులయ్యారు. జీహెచ్ఎంసీ మేయర్ గా పని చేసిన విజయలక్ష్మీ తన పదవి కాలం ముగియగానే మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమితులయ్యారు. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడిగా, ప్రభుత్వ సలహాదారుడిగా ఉన్న కేశవరావు తనయగా రాజకీయ అరంగేట్రం చేసిన విజయలక్ష్మీ తొలుత హైదరాబాద్ బల్ధియాలో కార్పొరేటర్ గా గెలిచి మేయర్ అయిన విషయం తెల్సిందే. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ ను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. చైర్మన్ గా గద్వాల విజయలక్ష్మీతో పాటు తెలంగాణ అమరుడు శ్రీకాంతచారి తల్లి కాసోజు శంకరమ్మ, చాకలి ఐలమ్మ మనమరాలు చిట్యాల శ్వేతతో పాటు శశికళ, సదాలక్ష్మీ, రాధాబాయిలతో పాటు ఉజ్మా షకీరాలను సభ్యులుగా నియమిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. సంబంధిత కమిషన్ ఐదేళ్ళ పాటు పదవి కాలం ఉంటుంది.