Batukammanews
Newspaper Banner
Date of Publish : 08 May 2026, 8:46 pm Posted by : ramakrishna

రేపే సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం

 

. . . తమిళనాడు సీఎం గా విజయ్ ప్రమాణ స్వీకారం

 

. . . రేపు ఉదయం 11 గంటలకు ప్రమాణం చేయనున్న విజయ్

 

. . . చెన్నై నెహ్రు ఇండోర్ స్టేడియంలో విజయ్ ప్రమాణ స్వీకారం

 

వెబ్ డెస్క్, బతుకమ్మ :

 

తమిళనాడు కు ముఖ్యమంత్రి గా టీవికే అధినేత విజయ్ శనివారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. శుక్రవారం సాయంత్రం చెన్నై లోక్ భవన్ లో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ కలిసారు. తనకు 118 మంది ఎమ్మెల్యే లు మద్దతు పలికిన పత్రాలను అందజేయడంతో ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్ కి గ్రీన్ సిగ్నల్ అందించారు. తమిళనాడు అసెంబ్లీకి గత నెలలో జరిగిన ఎన్నికల్లో తమిళగ వెట్రిగ కజగం 108 సీట్లతో అతి పెద్ద పార్టీగా నిలిచింది. అయితే ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 సీట్లు దక్కలేదు. ప్రభుత్వ ఏర్పాటుకు టీవీకే ను ఆహ్వానించాలని టీవీకే అధినేత విజయ్ ఇది వరకు రెండు సార్లు గవర్నర్ ను కలిసినా ప్రయోజనం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ టీవీకే కు ప్రభుత్వ ఏర్పాటులో బహిరంగంగా మద్దతు ప్రకటించింది. కాంగ్రెస్ తో పాటు వీసీకే మద్దతు తెలుపగా సీపీఐతో పాటు సీపీఎం లు బయట నుంచి మద్దతుకు అంగీకరించాయి. నాలుగు పార్టీల అలయన్స్ లో విజయ్ శనివారం తమిళనాడు ముఖ్య మంత్రి గా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సీపీఐ, సీపీఎం లు ప్రభుత్వంలో చేరలేమని మంత్రి పదవులను కోరడం లేదు. కాంగ్రెస్ తో పాటు వీసీకే కు మంత్రి పదవులు ఇచ్చే అవకాశముంది. తమిళనాడు సీఎం గా విజయ్ ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో ఆయన పెరంబూర్ నుంచి ఎమ్మెల్యే గా కొనసాగుతూ ఈస్ట్ తిరుచ్చి స్థానానికి రాజీనామా చేస్తారని తెలుస్తుంది. ఆ స్థానాన్ని వీసీకే పార్టీ అధినేత కు బరిలో దించి మంత్రి పదవి ఇస్తారని చర్చ జరుగుతుంది.