Batukammanews
Newspaper Banner
Date of Publish : 08 October 2025, 8:09 pm Posted by : ramakrishna

మార్కెట్ కమిటీ గ్రేడ్ -1 సెక్రటరిగా విజయ్ కిషోర్

నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ గ్రేడ్ -1 సెక్రటరిగా విజయ్ కిషోర్ ను నియమిస్తూ వ్యవసాయ సహకార మార్కెటింగ్ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు ఉత్తర్వులు జారీ చేశారు. నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీలో గ్రేడ్ -2 సెక్రటరిగా చాలా కాలం పని చేసిన విజయ్ కిషోర్ గతంలో బదిలీ అయ్యారు. ప్రస్తుతం నిర్మల్ జిల్లా ఇచ్చోడ వ్యవసాయ మార్కెట్ కమిటీ అసిస్టెంట్ సెక్రటరిగా పని చేస్తున్నారు. విజయ్ కిషోర్ ను ఏడాది కాలం పాటు డిప్యూటేషన్ పై నిజామాబాద్ గ్రేడ్ -1 సెక్రటరిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. రేపోమాపో ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు.