Batukammanews
Newspaper Banner
Date of Publish : 10 May 2026, 12:06 pm Posted by : ramakrishna

తమిళనాడులో విజయ్ శకం ప్రారంభం

 

. . . సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన జన నాయగన్

. . . విజయ్ తో పాటు 9 మంది మంత్రుల ప్రమాణం

. . . ప్రమాణ స్వీకార వేడుకలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా రాహుల్ గాంధీ, త్రిష

వెబ్ డెస్క్, బతుకమ్మ:

తమిళనాడు సీఎం సి. జోసెఫ్ విజయ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆదివారం చెన్నైలో జరిగిన ప్రమాణ స్వీకారం వేడుకలలో తమిళనాడు ఇంచార్జీ గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ టివికే అధినేత విజయ్ చేత సీఎంగా ప్రమాణ స్వీకారం చేయించారు. విజయ్ అనే నేను తమిళనాడు సీఎంగా ప్రమాణం చేస్తున్నాను అనగానే స్టేడియం మొత్తం సీఎం, సీఎం విజయ్.. అంటు నినాధాలతో దద్దరిల్లింది. విజయ్ తో పాటు తోమ్మిది మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకార వేడుకలకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, సినీ నటి త్రిష కృష్ణన్ సేంటర్ ఆప్ అట్రాక్షన్ గా నిలిచారు.

Vijay era begins in Tamil Nadu

ప్రభుత్వంలో నేనే పవర్ సెంటర్…

కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వం లో తనకు ఎవరు బాసులు లేరని..వేరే పవర్ సెంటర్ లేదని తానే పవర్ సెంటర్ అన్నారు తమిళనాడు సీఎం విజయ్ అన్నారు.. సీఎంగా ప్రమాణం చేసిన తర్వాత విజయ్ మాట్లాడుతూ.. నాకు ఆకలి తెలుసు.. పేదరికం తెలుసు.. నేను దేవ దూతను కాదు. అది చేస్తాం  ఇది చేస్తా  అని చెప్పను అని చెప్పింది చేస్తా  అన్నారు. తమిళనాడు ఏర్పడింది అస్థిర ప్రభుత్వం కాదని సుస్థిర ప్రభుత్వం అని సీఎం విజయ్ అన్నారు. తమిళనాడులో కొత్త శకం ప్రారంభమైంది.. ప్రజలకు టివికే అండగా ఉంటుంది.. ఇది ఉన్న నేరుగా మాట్లాడుతూ.. నేను మీకు హామీ ఇస్తున్నాను…. టివికే కార్యకర్తలు లేకుంటే నేను లేను. రాజకీయాల్లోకి వస్తే మేము చూసుకుంటాం ఆహ్వనించి అక్కున చేర్చుకున్నారు.ప్రభుత్వం ఏర్పడటానికి అధికారంలోకి రావడానికి పనిచేసిన కనిపించని వారియర్స్ కు కోటి వందనాలు. ఎవ్వరికి తెలియకుండా చీకటి రాజకీయాలు చేయను అన్నారు. గత ప్రభుత్వ హయాంలో 10 లక్షల కోట్ల అప్పులు అయ్యాయని త్వరలో ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేస్తాం అన్నారు…

 

Vijay era begins in Tamil Nadu

 పేదలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పై తొలి సంతకం…

తమిళనాడు సీఎంగా ప్రమాణ స్వీకారం తరువాత విజయ్ రాష్ట్రంలో పేదలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పై తొలి సంతకం చేశారు. మహిళ భద్రతపై రెండో సంతకం చేసి షీ టింల తరహా వ్యవస్థ ఏర్పాటు చేస్తామన్నారు. తమిళనాడులో గత కొన్ని సంవత్సరాలుగా వేధిస్తున్న డ్రగ్స్ వ్యతిరేకంగా ఈగల్ తరహా వ్యవస్థ కోసం మూడో సంతకం చేశారు.మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పై సంతకం చేసినట్లు తెలిసింది…