Batukammanews
Newspaper Banner
Date of Publish : 05 May 2026, 3:14 pm Posted by : ramakrishna

 టివికే శాసనసభ పక్షనేత గా విజయ్

 

. . .  మహబలిపురం క్యాంపునకు ఎమ్మెల్యేల తరలింపు

. . . రేపు గవర్నర్ అపాయింట్ మెంట్ కోరిన దళపతి

 వెబ్ డెస్క్, బతుకమ్మ:

తమిళ గ వెట్రి కళగం ( టివికే) పార్టీ శాసన సభ పక్ష నేతగా  విజయ్ ను ఎన్నుకున్నారు అ పార్టీ ఎమ్మెల్యేలు. సోమవారం నాటి  తమిళనాడు అసెంబ్లీ ఫలితాలలో 108 స్థానాలతో  టివికే అతిపెద్ద పార్టిగా అవతరించిన విషయం తెలిసిందే. ఫలితాల అనంతరం మంగళవారం చెన్నైలో టివికే ఎమ్మెల్యేల సమావేశం జరిగింది. టీవీ అధికార పగ్గాలు చేపట్టేందుకు కావాల్సిన 118 సభ్యుల ఎమ్మెల్యే ల మెజార్టీ కోసం ఇతరుల మద్దతు అవసరం కాగా దీనిపై చర్చించిన అనంతరం ఎమ్మెల్యే లను మహబలిపురం శిబిరం కు తరలించారు. అదే సమయంలో తమిళనాడు గవర్నర్ ను బుధవారం కలిసేందుకు టివికే అధినేత విజయ్ అపాయింట్మెంట్ కోరినట్టు తెలిసిందే. టివికేకు ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతించాలని గవర్నర్ ను కోరే అవకాశం ఉంది. అన్నీ కుదిరితే ఈ నెల 9న తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్టు సమాచారం